05-08-2025 01:32:42 AM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్నచింతకుంట, ఆగస్టు 4: అర్హులైన ప్ర తి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దేవరకద్ర ని యోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో 571 మందికి నూతన రేషన్ కార్డులు,62 కళ్యాణ లక్ష్మి చె క్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ. అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అ మలుచేసిన ఘనత, దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి దక్కుతుందన్నారు. జిల్లాలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు.
కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలిపించాలని కోరారు.ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు ప్రామాణికం అని కానీ గత పదేళ్లలో నూత న రేషన్ కార్డులు మంజూరు చేయకుండా, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ ప్రజలకు మా య మాటలు చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట మేరకు మన ప్రజా ప్రభుత్వం లో అర్హులైన వారికి మొదటి విడతలో 3625 ఇండ్లు మంజూరు చేయడంతో ప్రజలు ఎక్కడికక్కడ ఇండ్ల నిర్మాణాలను చేపట్టారని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో,తాసీల్దార్ ఎల్లయ్య అధికారులు పాల్గొన్నారు.