17 March, 2026 | 3:05 AM

గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడటం మా లక్ష్యం

17-03-2026 12:40 AM

ఎస్పీ కే నరసింహ

తుంగతుర్తి, మార్చి 16 : గ్రామాల్లో శాంతిభద్రతల కాపాడం పోలీస్ భరోసా లక్ష్యమని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలో అన్నారం గ్రామంలో ప్రజా పాలన పోలీస్ భరోసా కార్యక్రమంలో భాగంగా, గ్రామంలో యువత విద్యార్థులు గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ప్రజాపాలన పోలీసు భరోసా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం డ్రగ్స్ నివారణ, ఎలివ్ ఎరివ్ రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, సైబర్ క్రైమ్స్, షీ టీమ్స్, ప్రతి వాహన దారునికి హెల్మెట్ తప్పనిసరి వంటి, కార్యక్రమాలపై గ్రామాల్లో పట్టణాల్లో యువతకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  గ్రామాల్లోని ప్రజలు ప్రతి పంచాయతీకి పోలీస్ స్టేషన్ కోటమెట్లు ఎక్కకుండా గ్రామంలో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని అన్నారు. శాంతి భద్రతలకు కాపాడ కోసం100 హెల్ప్ లైన్, సైబర్ సెక్యూరిటీ కోసం 1930 నెంబర్లలో ఫోన్ చేస్తే తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

ప్రతి విద్యార్థి యువత విద్యలో రాణించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మద్యం నివారణ పై, ప్రతిజ్ఞ పూని, చెడు అలవాట్లపై దూరంగా ఉండాలని కోరారు. అనంతరం ఎస్పీ పల్లె దవాఖానకు వెళ్లి, రోగులతో మమేకమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  డిఎస్పి ప్రసన్న కుమార్ తుంగతుర్తి సీఐ నరసింహారావు, ఎస్‌ఐలు క్రాంతి కుమార్, చిరంజీవి ,సైదులు, కళాజాత బృందం, ఉప సర్పంచ్ రజిత దొంగరి శ్రీనివాస్, బింగి వెంకటేశ్వర్లు, బింగి లక్ష్మయ్య, కుంచాల ప్రవీణ్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, మహిళా సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.