17 March, 2026 | 2:03 AM

పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం

17-03-2026 12:43 AM

పాలకవీడు, మార్చి16 : గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పాలకీడు సర్పంచ్ పల్లి సుజాత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాలకీడు గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పల్లి సుజాత మాట్లాడుతూ గ్రామాలు,పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సేవకులు పారిశుధ్య కార్మికులేనని కొనియాడారు.

సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికుల సేవలు మరింత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి సత్యం వార్డు మెంబెర్స్ జానీ, జ్యోతి, వెంకటయ్య, సునీత,రజిత, నాగమ్మ, కార్యదర్శి, రాజ్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.