24-07-2025 12:00:00 AM
మూడో షెడ్యూల్ ముగించారు
అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కథా నాయకుడుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు ‘మెగా157’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెం ట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
వీటీవీ గణేశ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ యూనిట్ కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో బ్యూటీఫుల్ సాంగ్‌తోపాటు కీలకమైన టాకీ పోర్షన్స్‌ను చిత్రీకరించారు. 2026 సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు.