05-09-2025 01:59:45 AM
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సెయింట్ ఆన్స్‌తో నా అనుబంధం మరువరానిది
ఎన్‌సీసీ ప్రోత్సాహానికి నా వంతు కృషి ఉంటుంది
ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం
నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఆకాశమే సరిహద్దుగా మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్.. మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన చెప్పారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ క్రమంలో ఎదుగుతున్న మహిళలు వేసే ప్రతీ అడుగులోనూ రాష్ట్ర ప్రభు త్వం చేయూతనందిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రాంగణంలో గురవారం మంత్రి ఉత్తమ్ ఇంకుబ్యేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ పాఠశాలలు, కళాశాలల అధ్యక్షురాలు మదర్ అంథోనమ్మ, హైదరాబాద్ ప్రావిన్స్ పాఠశాల విద్యాసంస్థలకు చెందిన డాక్టర్ సిస్టర్ ఏ విజయ రాణి, ఎన్‌ఐయంఎస్‌యంఈ డైరెక్టర్ డాక్టర్ విజయ ఏరండి, వీ సీఈ వో సీతా పల్లచొల్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నారాయ ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ...
ఇంక్యూబేసిన్ కేంద్రాలు ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలబడతాయాన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యారంగం పరిశ్రమలతో కలసి ఏర్పాటు చేస్తే ప్రపంచ స్థాయి లో వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు. జనాభాలో సగభాగంలో ఉన్న మహిళల భాగస్వామ్యం లేకపోతే ఎం తో సామర్థ్యాన్ని కోల్పయిన వారమవుతామన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు సెయింట్ ఆన్స్ ప్రారంభించిన ఇంక్యూబేసిన్ ఫౌండేషన్ మార్గదర్శనంగా నిలిస్తుం దని చెప్పారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా హెల్త్ కేర్, విద్య, గ్రామీణాభివృద్ధి డిజిటల్ రంగాల పురోగతికి దోహదపడుతుందని వెల్లడించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. టీనూ వీనూ స్టార్టప్‌లతో సరిసమానంగా సెయింట్ ఆన్స్‌లో ప్రారంభమైన ఇంక్యూబేషన్ ఫౌండేషన్ మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు పునాదిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలతో తన అనుబంధం మరువరానిదని, తన విద్య మొదలయ్యిందే బీహెచ్ ఈఎల్‌లోని సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల నుంచి అని మంత్రి ఉత్తమ్ చేసుకున్నారు. తన జీవితంలో పని చేస్తున్న వృత్తులు ఎన్ని మలుపులు తిరిగినా ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, నైతిక విలువలు జీవితంలో భాగస్వా మ్యమయ్యాయన్నారు. ఎన్‌సీసీ బలోపేతానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యువతను అత్యున్నతులుగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్ట రాజధానిలో మొట్టమొదటిసారిగా వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు గుర్తుచేశారు. తద్వారా ప్రపంచం కూడలిలో ఎక్కడ నిలుచున్న ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ విశిష్టమైందని, అలాంటి హైదరాబాద్‌ను గ్లోబల్ నగరంగా రూపాంతరం చెందేలా ప్రణాళికలు రూపొంది స్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు.