calender_icon.png 7 September, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోండి

05-09-2025 02:00:55 AM

-పార్లమెంట్ సభ్యులకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ విజ్ఞప్తి

ముషీరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): భారత రాజ్యాంగం  ప్రాథమిక హక్కులను సమర్ధించే ప్రతిపక్షాల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ను ఎన్నుకోవాలని పార్లమెంట్ సభ్యులకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ.టి. నరసింహ మాట్లాడుతూ నిరం కుశ నియంతృత్వ పాలన నుండి భారతదేశాన్ని రక్షించడానికి, భారత రాజ్యాంగం,  న్యాయవ్యవస్థలో ఆయన గొప్ప అనుభవం ఉన్న ఉప రాష్ట్రపతి పదవికి అత్యంత తగిన వ్యక్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నాడని చెప్పా రు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని రక్షించాలని, పౌర ప్రజాస్వామిక హక్కులు కాపా డబడాలని జరుగుతున్న పోరాటంలో నిజాయితీగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారన్నా రు. అనంతరం ఇటీవలే జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన సిపిఐ రాష్ట్ర నేత ఈ.టి. నరసింహను హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా సమితి శాలువా గజమాలతో ఘనం గా సన్మానించింది.

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ గౌడ్, పడాల నలిని, నేర్లకంటి శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, షేక్ శంషుద్దీన్, మామిడిచెట్ల వెంకటస్వామి, మహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.