29-07-2025 12:03:35 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహించనున్నారు.
పీసీసీ అధ్యక్షుడు, మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాదయాత్రల ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేలా పీసీసీ కార్యక్రమాన్ని రూపొందించింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈనెల 31 నుంచి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో జిల్లాస్థాయి పాదయాత్ర చేయ డం.. ఏదైనా ఓ గ్రామంలో బస చేయడం తో పాటు మరుసటి రోజు శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు పీసీసీ ప్రణాళిక రూపొందించింది.
మొదటి విడతగా ఆరు జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఎంపిక చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసు కుంది. కాగా, పాదయాత్ర నిర్ణయించిన తేదీల్లో నియోజకవర్గంలోని ముఖ్యమైన పట్టణ కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి 8 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించడం, అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పల్లె నిద్ర చేయనున్నారు. మరుసటి రోజు గ్రామంలో శ్రమదానం నిర్వహిస్తారు.
అనంతరం ఆ జి ల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం మరో నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమాలు చేపడతా రు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ రాష్ట్రంలో పాదయాత్ర చేయ నున్నారు.
ఆమె చేపట్టే యాత్ర రూట్‌మ్యాప్‌ను పీసీసీ సోమవారం ప్రకటించిం ది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు యా త్ర చేయనున్నారు. 7 రోజులపాటు పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదం డి, వర్ధనన్నపేట నియోజకవర్గాల్లో రోజూ 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతారు.
పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ ప్రజలతో మమేకమవడం, వా రు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షం గా తెలుసుకోకున్నారు. పాదయాత్రకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఇన్‌చార్జులను ప్రకటించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పార్టీ నేతలు డాక్టర్ కేతూరి వెంకటేశ్, జూలూరు ధనల, పులి అనిల్‌కుమార్ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.