calender_icon.png 29 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో జరిగిన ఘటనలపై పూర్తి రిపోర్టును కమిషన్ ముందు పొందుపరచాలి

29-07-2025 12:01:46 AM

గురుకులాల సెక్రటరీ కి కమిషన్ ఆదేశం

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుబ్రహ్మణ్యం

ఆప్ నేతల ఫిర్యాదు మేరకు విచారణ

ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రెడ్డి సుధాకర్

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు గురుకులాల్లో ఆత్మహత్య, అనుమానస్పద మృతి, ఫుడ్ పాయిజన్ పలు కారణాల వల్ల 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందని, 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారని, ఇట్టి విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషా జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ సోమవారం హైదరాబాదులో ఉన్న మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో విచారణ చేపట్టడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్(Convener Dr. Sudhakar) తెలిపారు. 

ఈ విచారణకు తెలంగాణ రాష్ట్ర గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని హాజరవడం జరిగిందన్నారు. ఇట్టి ఫిర్యాదుపై, మరణాలపై మీరు తీసుకున్న చర్యల గురించి అడుగుతూ నాలుగు వారాలలో పూర్తి రిపోర్టు కమిషన్ వద్ద పొందుపరచాలని కమిషన్ చైర్మన్ వి.  సుబ్రహ్మణ్యం ఆదేశించడం జరిగిందని తెలిపారు. అలాగే కమిషన్ ముందు నయీం పాషా స్పందిస్తూ 27 జూలై 2025 రోజున నాగర్ కర్నూల్ జిల్లాలో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్వస్థతకు గురయ్యారని కమిషన్ ముందు పత్రికలలో వచ్చిన ప్రకటన కాపీని సమర్పించడం జరిగింది. దీనిపై కూడా కమిషన్ స్పందిస్తూ పూర్తి రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో ఆప్ నేతలు బుర్ర రాము గౌడ్, ఎంఏ. మాజీద్, విజయ్ మల్లంగి, డా. లక్ష్య నాయుడు, దర్శనం రమేష్, నయీమ్ పాషా, రాజేందర్, రమ్య గౌడ్, అజీమ్ బేగ్, కొడంగల్ శ్రీనివాస్, షాబాజ్, దర్శనం రమేష్, వికాస్ రెడ్డి , శివాజీ తదితరులు పాల్గొన్నారు.