calender_icon.png 23 December, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి

23-12-2025 08:45:03 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ ప్రక్రియతో పాటు పంచాయితీ సెక్రటరీల హాజరు అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సంబంధిత అధికారులతో  కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎల్పీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్కవుట్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే పంచాయితీ సెక్రటరీల హాజరు వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలని, రోజువారీ హాజరు పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండలాల వారిగా పురోగతిని అడిగి తెలుసుకొని, మార్కవుట్ పనులను వేగవంతం చేయాలని అన్నారు.పంచాయితీ సెక్రటరీలు సమయపాలన పాటించేలా, ఉదయం ఫీల్డ్ కు వెళుతున్నారా లేదా ఆరా తీయాలని, ప్రతీ రోజు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.