calender_icon.png 5 May, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకల్యాన్ని అధిగమించి ముందుకు సాగాలి

28-03-2025 12:00:00 AM

దివ్యాంగులకు ఉపకరణల పంపిణీలో కలెక్టర్ దీపక్

మంచిర్యాల, మార్చి 27 (విజయక్రాంతి ): దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, అలిం కో సంస్థ ప్రతినిధులు డాక్టర్ రంజిత్ రెడ్డి, రిషిగుప్తాలతో కలిసి దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవ చ్చన్నారు. పుట్టిన పిల్లలలో ఏమైనా దివ్యాం గ లోపాలు గుర్తించినప్పుడు చిన్నతనం నుంచే వారికి ప్రత్యేక అవసరాలను అందించాలన్నారు. అలింకో సంస్థ ద్వారా రూ. 17.౫౦ లక్షల విలువ గల వినికిడి యంత్రా లు, ట్రై సైకిళ్ళు, బ్రెయిలీ కిట్లు, సి.పి. చైర్లు మొత్తం 215 ఉపకరణాలు పంపిణీ చేయ డం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దివ్యాంగుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.