calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజోన్ ఆసుపత్రి సేవలు భేష్

20-09-2025 12:47:45 AM

సింగరేణి అధికారుల అభినందన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): వైద్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ఓజోన్ హాస్పిటల్స్‌ను సందర్శించిన సింగరేణి కోల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ అధికారులు ఆసుపత్రి సేవలు, బృంద సమన్వయం పట్ల ప్రశంసలు వెల్లువెత్తించారు. బృందానికి డాక్టర్ బాలకోటయ్య (అడిషనల్ డైరెక్టర్), డా. కిరణ్ (సీఎంవో) నాయకత్వం వహించారు. రోగులకు నాణ్యమైన, ఆధునిక వైద్యం అందించాలనే ఆసుపత్రి కట్టుబాటు వారిని ఆకట్టుకుంది.

సందర్భంగా ఓజోన్ హాస్పిటల్స్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, సీవోవో డా.వై. సుమన్ కుమార్ ఆసుపత్రి వైద్యపరమైన నూతన ఆవిష్కరణలు, రోగి భద్రత చర్యలను అధికారులకు వివరించారు. అధికారులు మాట్లాడుతూ, ఓజోన్ హాస్పిటల్స్ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ సామాజిక సేవలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి చికిత్స అందించడమే కాక, వైద్య సిబ్బంది నిబద్ధత, ఆధునిక సాంకేతిక వినియోగం ప్రశంసనీయమని పేర్కొన్నారు.