calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలాపూర్ సర్పంచ్‌ పదవికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పబ్బు సతీష్‌ నామినేషన్

27-11-2025 07:43:43 PM

హనుమకొండ (విజయక్రాంతి): కమలాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి బీజేపీ తరఫున పబ్బు సతీష్‌ గురువారం ఘనంగా నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున సన్నిహితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తల ర్యాలీతో మండల కేంద్రానికి చేరుకున్న సతీష్‌.. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి చేతులకు అందజేశారు. గ్రామంలో వినిపించిన నినాదాలతో నామినేషన్ వేడుక సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. 

తదుపరి మాట్లాడిన పబ్బు సతీష్‌ కమలాపూర్‌ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం. గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే కమలాపూర్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తానుఅని నమ్మకంగా పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చిన తక్షణమే స్పందించి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కమలాపూర్ ప్రజలు తనకు ఆశీర్వాదం అందచేసి సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ, గ్రామ అభివృద్ధికి తాను అంకితభావంతో పనిచేస్తానని సతీష్ పిలుపునిచ్చారు.