13-03-2025 12:43:57 AM
ఖానాపూర్,(విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎట్టకేలకు నియామకం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ,పార్టీ నాయకత్వం, ఆ పార్టీ సీనియర్ నాయకులు ,కష్ట సమయంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులకే దక్కింది. రాష్ట్రంలో అన్ని మార్కెట్లకు పాలకవర్గాలు నియామకం జరిగిపోయినప్పటికీ, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో నిర్ణయం కొంచెం జటిలమైనప్పటికీ ,కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే పట్టం కట్టినట్లు అయిందని , పలువురు భావిస్తున్నారు .ఈ మేరకు బుధవారం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు, పాలకవర్గాన్ని ప్రకటించారు .గతంలోని మార్కెట్ కమిటీకి భిన్నంగా, ఈసారి ఖానాపూర్ మండలానికి దక్కుతుందనుకున్న చైర్మన్ పదవి, కడెం మండలం అభ్యర్థికి ప్రకటించడం వినూత్న నియామకమని చర్చ సాగుతోంది. కాగా కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పడిగెల భూమన్నను చైర్మన్గా నియమించగా, వైస్ చైర్మన్ పదవి ఖానాపూర్ మండలానికి దక్కింది. మండలంలోని మస్కాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్ ను వైస్ చైర్మన్ గా నియమించారు. వీటితో పాటు మరో పదహారు మంది మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించబడ్డారు .వారిలో నాగవత్ పూల్యానాయక్, సోమరెడ్డి నారాయణరెడ్డి, దాతుర్క గంగాధర్ ,సాగి అశోక్ రావు, దండుగుల యాదగిరి ,తోకల మహేందర్, ఊరే జలజ ,అడవాలా చిన్న రాజన్న, లక్కవత్తుల నారాయణ ,తొడసం విట్టల్, గంప దయాకర్ ,కటకం శేఖర్రయ్యా ,వీరితోపాటు మండల ఫ్యక్ట్ చైర్మన్ ,జిల్లా మార్కెటింగ్ అధికారి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఖానాపూర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి, సభ్యులుగా ఉన్నట్లు ప్రకటించారు.