15-05-2025 02:32:51 AM
సంగారెడ్డి, మే 14(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పా టు పరిసరాలు శుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్(ఎస్బీఎం) ద్వారా అనేక కా ర్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సంగారెడ్డి జిల్లాకు రూ.18.72 కోట్ల నిధులను ఆ విభాగానికి కేటాయించింది.
వాటి ద్వారా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కా ర్యాచరణను సిద్ధం చేసింది. ఏడాదిలోపు పూర్తిచేసేలా మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తూ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. తదనుగుణంగా పను లు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మింపజేసేలా ప్రజలను చైతన్యవంతు లు చేయడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
ఇంకుడు గుంతలు..మరుగుదొడ్లు...
ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పరిశు భ్రతతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టి భూ గర్భజలాలు పునరుద్ధరించే దిశగా నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. వీటి నిర్మాణాలకు రూ.12వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది.
అలాగే మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ టాయిలెట్లకు రూ.3 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. జి ల్లాలో 19 కమ్యూనిటీ టాయిలెట్స్ మంజూరయ్యాయి. అలాగే భారీ కమ్యూనిటీ సోక్పి ట్స్ సైతం చేపట్టనున్నారు. గ్రామాల్లో పోగైన చెత్తను సేకరించి సెగ్రిగేషన్ చేసేందుకు వీలు గా షెడ్లను నిర్మించనున్నారు.
వీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలను ప్రాసెస్ చేసేందుకోసం ఈసారి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మె్ంప కేంద్రం దృష్టి సారించింది. జిల్లాలో తొలిసారిగా నా లుగు యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్కు రూ.65 లక్షల చొప్పున కేటాయించనున్నారు. జహీరాబా ద్, రాయికోడ్, చౌటకూర్, కంది మండలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి...
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనే ఆసక్తి గల కుటుం బాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. నిర్మాణాలు పూర్తయ్యా క రూ.12 వేల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉం టుంది. అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్, సోక్ పిట్స్ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై ఎంపీడీవోలు నిర్ణయించనున్నారు.
అందుకు ప్రభుత్వ స్థలాలు అవసరమున్నందున రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బహిరంగ మల విసర్జన రహితంగా గ్రామాలను తీర్చిదిద్దడంతో పాటు నీటి వనరులు సంరక్షించే దిశ గా నిర్మాణాలు సాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి...
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనటువంటి వారికి ఎస్బీఎం మంచి అవకాశం. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిలో మరుగు దొడ్డి నిర్మించుకోవాలి. అలాగే కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వాటి నిర్మాణాలు చేపట్టాలి.
స్వామి, జిల్లా కో ఆర్డినేటర్,
ఎస్బీఎం, సంగారెడ్డి