15-05-2025 12:50:10 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ర్ట అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి భూభారతి చట్టంలో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ర్టంలో పేరుకుపోయిన భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకున్నామన్నారు.
గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే దరఖాస్తులకు నిర్దేశిత గడువు పెట్టుకొని భూభారతి పరిధిలోకి వచ్చే ప్రతీ దర ఖాస్తుకు పరిష్కారం చూపిస్తామన్నారు.
కొన్ని సమస్యల పరిష్కారం..
ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలు గు మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించినట్లు మంత్రి పొంగులేటి తెలి పారు. ఈనెల 30వ తేదీ నాటికి దాదాపు 60 శాతం భూసమస్యలను పరిష్కరిస్తామన్నారు. భూభారతి చట్టానికి లోబడి పరిష్కరించవలసిన అన్ని సమ స్యలకు పరిష్కారం చూపుతూ.. పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతు న్నామనే విషయాన్ని లిఖితపూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని తెలిపారు.
అసలు పరిష్కారయోగ్యం లేనివి, అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావుఅని తెలి యజేస్తామన్నారు. భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలనేది భూభారతి చట్టం లక్ష్యంగా పేర్కొన్నారు. రెండోద శలో 28 మండలాల్లో నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సుల్లో కూడా ఈనెల చివరినాటికి వీలైనం తవరకూ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.
సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అ యితే ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తులను మా త్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ప్రజల నుంచి అనూహ్య స్పందన
ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గత ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి చట్టాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఈ చట్టం వల్ల తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న సంతోషం వారిలో కనిపిస్తోందన్నారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు, ‘భూభారతి’ అమలు..
గవర్నర్‌ను కలిసి వివరించిన మంత్రి పొంగులేటి
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున, రాష్ట్రంలో మొత్తం 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అదనంగా 500నుంచి 700 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10వేల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు గవర్నర్‌కు మంత్రి తెలిపారు.
బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ భారతి చట్టం అమలును వివరించారు. గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూసకుంట, గొగులపూడి, అదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ, నాగర్‌కర్నూల్ జిల్లా అప్పాపూర్, బౌరౌపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసినట్లు తెలిపారు.
భూభారతి చట్టాన్ని గత నెల నుంచే రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో అమలుచేస్తున్నామని తెలిపారు. ఎలాంటి రుసుం లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.