calender_icon.png 15 May, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు

15-05-2025 01:28:52 AM

  1. శ్వేతపత్రం విడుదల చేయండి
  2. వర్షానికి తడిసిన ప్రతీ గింజను కొనాలి
  3. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మొత్తం 48 లక్షల ఎకరాలకు నీళ్లందించి, సాగును బాగు చేసినమం టూ సీఎం మాట్లాడటం హాస్యాస్పదమన్నా రు.

ఏడాదిన్నర పాలనలో ఇరిగేషన్ శాఖలో చేసిందేమి చెప్పుకోలేక అడ్డగోలుగా మాట్లాడి సీఎం విలువ తగ్గించుకుంటున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌రా వు మండిపడ్డారు. రేవంత్ పాలనలో పెరిగింది ఇరిగేషన్ కాదనీ, ఇరిటేషన్ అన్నారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారని హరీశ్‌రావు ఆరోపించారు.

మీ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు తెగిపోయిందని, ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూలిందని, వట్టెం పంపుహౌజ్ మునిగిపోయిందన్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖలో 30 ఈఎన్సీ, సీఈవో పోస్టుల్లో 15, 57 సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుల లో 40 ఖాళీ ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో నీటి పా రుదల రంగంలో 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించామని హరీశ్‌రావు చెప్పారు. 31.50 లక్షల ఎకరాల్లో వ్యవసాయ స్థిరీకరణ చేసినట్లు ఆయన తెలిపారు. 

రైతుల కన్నీటి గాథలు

రాష్ట్రంలో తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బుధవారం ఎక్స్ వేదికగా కోరారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం దగ్గర చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే ఉన్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసే సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా కళ్లు తెరవాలని విజ్ఞప్తి చేశారు.