21-08-2025 07:50:45 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా గురువారం రోజు నగరంలోని పద్మనగర్, కట్టరాంపూర్ ప్రాంతంలో ఇంజనీరింగ్, సానిటేషన్ అధికారులతో కలిసి కరీంనగర్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) పర్యటించారు. మొదటగా నగరంలోని పద్మానగర్ చౌరస్తాను సందర్శించి బుల్ సెమెన్ సెంటర్ వైపు నగరపాలక సంస్థ ద్వారా నిర్మాణం చేస్తున్న డ్రైనేజీ, పహారి గోడ నిర్మాణం పనులను తనిఖీ చేసి, పద్మానగర్ చౌరస్తాలో ప్రమాదకంగా మారిన రోడ్డును పరిశీలించారు. మరో వైపు పద్మానగర్ పార్కుతో పాటు పట్టణ ప్రకృతి వనంను సందర్శించి, పార్కులో అభివృద్ధి పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన సుందరీకరణ పనులను తనిఖీ చేసి పట్టణ ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ చర్యలను పరిశీలించారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, పద్మానగర్ చౌరస్తాలో రోడ్డు కొంత ప్రమాదకంగా మారిందని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీస్కోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పద్మానగర్ పార్కు సుందరీకరణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని పార్కులో అసంపూర్తిగా పనులు చేసిన ఏజెన్సి కాంట్రాక్టర్ ను పిలిపించి పనులు చేపట్టేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈ శ్రీనివాస్, లచ్చిరెడ్డి, సానిటేషన్ సూపర్ వైజర్ శ్యామ్, వెటర్నరీ ఆఫీసర్ పాల్గొన్నారు.