calender_icon.png 12 August, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిడేరు.. ఊరంతా మసిలే జలధారలు

12-08-2025 12:00:00 AM

- బొగ్గు కోసం వేసిన బోర్ల నుంచి ఉబికి వస్తున్న వేడినీరు

- కరెంటు మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న పాతాళ గంగ 

- బోరుబావుల నుండి ఏళ్లుగా ఉప్పొంగు తున్న వేడి ప్రవాహం

- సాగుకు వాడుకుంటున్న రైతులు

- భూగర్భ వేడినీళ్ల ఆవిరితో విద్యుదుత్పత్తి

మణుగూరు, ఆగస్ట్ 11,(విజయ క్రాంతి) :కరెంటు, మోటర్ అవసరం లేకుండా స మృద్ధిగా నీరిచ్చే బోరు బావులను ఎక్కడైనా చూశారా..చూడ లేదు కదు.. వింత కాదు, ఇ ది నిజం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు.గ్రామంలో బోరు బావుల నుండి సల సల మసిలే నీరు పొగ లు కక్కుతూ ఉబికి వస్తోంది. గ్రామంలో ఏ డాదంతా వేడి నీరు జలధారల తో ప్రవహి స్తుంది. పంపు కాదది పాతాళ గంగ అన్నట్టు, భూగర్భం నుండి వస్తున్న నీటితో బోరు బా వులు పొంగి పొర్లుతు న్నాయి.

ఎక్కడా కనిపించని, అద్భుత,ఆశ్చర్యకర మైన వేడి నీటి జలధారలు నెలకొన్న ఆ ఊరి విశిష్ట తపై విజయ క్రాంతి ప్రత్యేక కథనం ..సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఆవిర్భవించిన తొలినాళ్లలో 40 ఏళ్ల క్రితం బొగ్గు నిక్షేపాల ను కనుగొనేందుకు పగిడేరు పంచాయతీ పరిధిలో గొల్లకొత్తూరు, కొడి శలకుంట, పగిడేరు గ్రామాల్లో 8 పాయింట్లలో బోర్లు వే యగా.. వాటి ద్వారా 1,000 మీటర్ల లోతు నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది. ఎలాంటి మోటార్లు, ఇంజన్ల సహాయం లే కుండానే నీరు రావడం ఆ నాడు అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట ఆ నీటిని వాడుకునేందుకు గ్రామస్తులు సంకోచించిన రాను రాను ఆ నీటితో ఎటువంటి ఇబ్బందులు తలెత్తక పోవడంతో ఆనీరు ఇప్పుడు వారికి ప్రధాన సాగునీటి వనరుగా మారింది. సింగరేణి జియో ధర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపనకు కేంద్రమైంది.

ఏళ్లుగా మసిలే జల ధారలు...

 గ్రామంలో బోరుబావుల నుండి ఏళ్లుగా మసిలే జలధారల ప్రవాహం నిరంతరాయంగా సాగు తుంది. ఇక్కడి నుండి బయటి కి వచ్చే వేడి నీరు ఉష్ణం 81 డిగ్రీ లు.. భూమి నుంచి బయటికి వచ్చే వేడి నీరు ఉష్ణం 180 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సు మారు 63 డిగ్రీల వేడితో ఉండే ఈ నీటిని స్థానిక రైతులు కాలువల ద్వారా ఒకరోజు కుంటల్లో కి మళ్లించి ఆరబెట్టి మరుసటి రో జు చల్లారిన తర్వాత సాగుకు వినియోగిస్తున్నారు. ఈ నీటి ద్వారా ఈ ప్రాంతం లో సుమారు 200 ఎకరాల మాగాణి సాగవు తోంది. 

ఎందుకిలా..?

గ్రామానికి సమీపంలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటం, గోదావరి నది పరివాహక ప్రాంతం కావడం , బొగ్గు గనుల వల్ల భూమి పొరల్లో చోటు చేసుకున్నరసాయనిక మార్పుల వల్ల నీరు వేడిగా మారుతున్నదని శాస్త్రవేత్త లు అంటున్నారు. మన దేశంలో ఇలా వేడి నీరు వచ్చే ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ.. పగిడేరు పూర్తి విభి న్న మైనదని, వారు చెబుతున్నారు. అయితే ఈ నీటికి అంతలా వేడివస్తుందో తెలుసుకోవ డానికి మరింత లోతుగా పరిశోధనలు చే యాల్సి ఉందని శాస్త్రవేత్త లు అంటున్నారు.

భూగర్భ వేడినీళ్ల ఆవిరితో విద్యుదుత్పత్తి..

పగిడేరు ప్రాంతంలోని వేడి ఆవిరి బావులతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయోగాత్మ కంగా 20 కిలో వాట్ల ప్లాంట్ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, భూ గర్భం నుంచి సహజ సిద్ధంగా లభించే వేడినీటి ఆవిరితో వి ద్యుత్తు ఉత్పత్తిపై సంస్థ దృష్టి సా రించింది. రానున్న రోజుల్లో ఓ ఎన్జీసీ భా గస్వా మ్యంతో భారీ జియోథర్మల్ ప్లాంట్లను నిర్మించాలని యోచిస్తున్నది. ప్రాథమికంగా 200 మెగావాట్ల విద్యుత్తు ను ఉత్పత్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నది.

65 నుంచి 80 డిగ్రీ ల వేడితో ఉన్న ఈ జలాలు ఫై అధికారులు నిపుణులతో అధ్యయనం చేయించా రు. ఈ నీరు కనీసం 20 ఏండ్ల పాటు లభ్యమవు తుందని వారు అంచనా వేశారు. ఈ నేపథ్యం లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సమీపంలో రవాణా సౌకర్యంతో పాటు,ఈ ప్రాంతంలో జియోథర్మల్ పవర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనేక సానుకూలతలు ఉన్నా యని అధికారులు వివరించారు. వేడినీరు ఉద్భవించే ప్రదేశాలలో ఒకటిగా ఈ మారుమూల గ్రామం విశిష్ట తలతో ఇప్పుడు దేశంలోనే గుర్తింపు పొందింది.

పర్యటక కేంద్రంగా అడుగులు..

పగిడేరులో వేడినీటి ప్రాంతాలను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవలే కలెక్టరు పగిడే రులో పర్య టించి వేడినీటి కేంద్రాలను పరిశీలించారు. వేడినీటి కేంద్రాలను పర్యాటకంగా రూపొం దించాలని నిర్ణయించారు. ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో తొట్లు, ఔషధ మొక్కల పెం పకం, విశ్రాంతి భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాంతానికి వచ్చిన వారికి చుట్టు ఉన్న గుట్టలు, అడవిని చూపించేందుకు వీలు కల్పించనున్నారు. వీటి నిర్వహ ణ బాధ్యతలను గిరిజన సొసైటీ లకు అప్పగించ నున్నారు. దీంతో స్థానిక గిరిజను లకు ప్రయోజనం కలగనున్నది.