12-08-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ (ఆల్బెండజోల్) మాత్రలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సారంగాపూర్ మండలం చించోలి.బి సమీపంలోని ప్రభుత్వ బాలుర మైనారిటీ వసతి గృహ విద్యార్థులకు అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయో జనాలు ఉన్నాయని అన్నారు. ప్రతి సంవత్స రం విధిగా మాత్రలను తీసుకోవాలని అన్నా రు. విద్యార్థులంతా ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పా రు. వ్యక్తిగత శుభ్రతనుకు ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. వానాకాలం అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడుతూ, పాఠశాల, వసతి గృహాలకు సం బంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల అన్ని కమిటీలను విద్యార్థులచే నిర్వహించాలన్నారు. వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రతీ రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, ఇన్ చార్జి డీఈఓ పరమేశ్వర్, కార్యక్రమ నిర్వహణ అధికారికి నయానా రెడ్డి, వైద్యాధి కారులు సౌమ్య, పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.