20-05-2025 02:43:22 AM
అమృత్‌సర్, మే 19: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో తట్టుకోలేని పాకిస్థాన్.. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ను టార్గెట్ చేసుకుందని, అయితే పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టా మని మేజర్ జనరల్ కార్తీక్ సీ శేషాద్రి సోమవారం వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడుతుందని భారత సైన్యం అం చనా వేసింది.
పాక్‌కు ఎలాంటి కచ్చిత లక్ష్యాలు లేకపోవడంతో గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నట్లు భావించామని ఆయన చెప్పారు. అందుకే గోల్డెన్ టెంపుల్‌కు అదనపు రక్షణ కల్పించి పూర్తి సన్న ద్ధంగా ఉన్నామన్నారు. భారత ఆర్మీ, ఎయిర్ డిఫెన్ గన్నర్స్.. పాక్ సైన్యం ప్రణాళికలను సమర్థవంతంగా తిప్పికొట్టి స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా పాక్ డ్రోన్లను, క్షిపణులను కూల్చివేసినట్లు ఆయన చెప ్పుకొచ్చారు.
మే 8న పాక్ మానవ రహిత వైమానిక ఆయుధాలతో ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసిందని ఆయన తెలిపారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఎల్‌హా ఎయిర్ డిఫెన్స్ గన్స్ సహా భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ నగరాలను పాకిస్థా న్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి ఎలా రక్షించాయో ప్రజలకు తెలిసేలా సైన్యం ప్రదర్శించింది.