14-08-2025 01:14:14 AM
-ప్రధాని షెహబాజ్ షరీఫ్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: పాకిస్థాన్‌కు చెందిన ఒక్క నీటి బొట్టును ఆపాలని చూసినా భారత్‌కు గుణపాఠం నేర్పుతామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఓ సమావేశానికి హాజరైన షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పాక్‌కు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు సింధు నదీ జలాల ఒప్పందం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు, చినాబ్, జీలం నదులపై పాక్‌కు గుత్తాధిపత్యం, భారత్‌కు నామమాత్రపు ఆధిపత్యం.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు ఆధిపత్యం కల్పించారు. ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది.