calender_icon.png 14 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్ సురేశ్ రైనాపై ఈడీ ప్రశ్నల వర్షం

14-08-2025 12:00:00 AM

బెట్టింగ్ యాప్స్ కేసులో.. 

న్యూఢిల్లీ, ఆగస్టు 13: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రముఖులను విచారిస్తున్న ఈడీ బుధవా రం 1ఎక్స్‌బెట్ బ్రాండ్ అంబాసిడర్ సురేశ్‌రైనాను విచారించింది. ఢిల్లీలోని  కార్యాల యంలో విచారణకు హాజరయ్యారు. ఈ సం దర్భంగా సురేశ్‌రైనాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. 1ఎక్స్‌బెట్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో మీ పాత్ర ఏమిటి?

మీ కు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీల కు సంబంధించి రికార్డులు ఉన్నాయా? అని విచారించారు. గ్యాంబ్లింగ్, అన్‌స్కిల్ బేస్డ్ గేమ్స్ అని మీకు ఎప్పు డు అనిపించలేదా? భారత చట్టాల ప్రకారం ఇలాంటి యాప్స్ ఇల్లీగల్ అని మీకు తెలియదా? 1ఎక్స్‌బెట్ నిర్వాహకులతో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యారా? తదితర ప్రశ్నలను ఈడీ అధికారులు రైనాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.