02-05-2025 11:37:51 PM
పహల్గాం ఘటనపై స్పందించిన పాక్ నటి హనియా అమీర్
ఉగ్రదాడి పాక్ ఆర్మీ పనేనని ఎక్కడా చెప్పలేదు
హనియా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన భారత్
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాంపై ఉగ్రదాడి చేయించింది పాక్ ఆర్మీయేనని ఆ దేశ నటి హనియా అమీర్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన హనియా పహల్గాం ఉగ్రదాడి పాక్ ఆర్మీ పనేనని తాను ఎక్కడా చెప్పలేదని, అనవసరంగా తప్పుడు పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేసింది. ‘నేను ఎప్పుడు పహల్గాం ఉగ్రదాడిపై స్పందించలేదు. నా వ్యాఖ్యలను తప్పుడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పాక్ ఆర్మీనే పహల్గాం ఉగ్రదాడిని చేయించిందని నేనెప్పుడు చెప్పలేదు. ఇది నా దేశాన్ని అవమానించడం కిందే లెక్క. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపింది. ఇక హనియా అమీర్ సహా పలు పాక్ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను భారత్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దీనిపై హనియా స్పందిస్తూ.. తాను పహల్గాం ఉగ్రదాడిపై వ్యతిరేక పోస్టు పెట్టినట్టు ఎక్కడా ఆధారాలు లేనప్పటికీ భారత్ తన అకౌంట్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం దారుణమన్నారు. రుజువులు లేకుండా నిందించడం సరికాదని పేర్కొంది.