03-05-2025 12:39:24 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీమనోహర్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఇప్పటివరకు ప్రేక్షకులు తెరపై చూడని కాన్సెప్ట్‌తో కూడిన డార్క్ కామెడీ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని చిత్రబృందం చెప్తుండగా,
ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. పర్ఫెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో తెలియజేసేలా ఉందీ పోస్టర్. ఇందులో ఇంకా బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, జీవన్‌కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ మిగతా పాత్రలు పోషిస్తున్నారు.