20 August, 2026 | 1:54 AM

నగర అభివృద్ధిలో పాలమూరు కార్మికుల పాత్ర ఎంతో ఉంది

20-08-2026 12:13 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కూకట్‌పల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో పాలమూరు కార్మికుల పాత్ర ఎంతో ఉందని మా జీ మంత్రి, బిఆర్‌ఎస్ నాయకుడు వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబం డలోని పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షే మ సంఘం కార్యాలయాన్ని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యం లో చేపడుతున్న కార్యక్రమాలను సంఘం ని ర్వాహకుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

తను కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ గా ప ని చేసినప్పుడు ఎల్లమ్మబండ కాలనీలో అనే క అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు గు ర్తు చేశారు. పాలమూరు జిల్లా అంటేనే వల స కార్మికుల జిల్లా అని పేరుంది, ఎల్లమ్మబండతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పాలమూరు వాసులు నివాసం ఉంటున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగర ని ర్మాణంలో, అభివృద్ధిలో పాలమూరు కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు.

ఈ కా ర్యక్రమంలో పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి గోపాస్ రవీందర్, సీనియర్ జర్నలిస్టులు ఆర్.కే. దయాసాగర్, రాము, బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ రెడ్డి, కాంట్రాక్టర్ శంకర్, దేవయ్య, యాదగిరి, నరసింహ, మాచర్ల భద్రయ్య, బోయ రాజు తదితరులు పాల్గొన్నారు.