ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్
14-06-2024 03:49 PM
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం అయ్యారు. గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో రికార్డ్ స్థాయి మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందారు. గతంలో అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి టీడీపీలో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి శ్రీనివాస్ ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడియపోయారు. ఓటమి తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.






