పాఠ్య పుస్తకం తప్పులపై ప్రభుత్వం చర్యలు
14-06-2024 04:53 PM
హైదరాబాద్: తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్ సీఈఆర్ టీ అదనపు డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి, రాధారెడ్డిని సర్కార్ తొలగించారు. ఎస్ సీ ఈఆర్ టీ డైరెక్టర్ గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్ కు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్ కి ముద్రణ సేవల డైరెక్టర్ గా బాధ్యతలను అప్పగించింది.






