03-05-2025 12:00:00 AM
విచారణ చేస్తే వందలాది డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశం
ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న కొందరు డాక్యుమెంట్ రైటర్లు
ధ్రువీకరణ పత్రం తప్పనిసరి ఏమీ కాదు : మమ్మద్ హమీద్, సబ్ రిజిస్టర్, మహబూబ్ నగర్
కేసు నమోదు చేశాం : ఎస్సై కోయిలకొండ మండలం
మహబూబ్ నగర్ మే 2 (విజయ క్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎలాగో ఒకలా.. వివిధ కంపెనీలకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్ స ద్వారా వారి ఇండ్లను తాకట్టుపెట్టి రుణాలు తీసుకునేందుకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఆర్చిత కనబరుస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుంటే కచ్చితంగా మీ గ్రామంలో మీ ఇల్లు ఉన్నట్లు ధృవీకరణ పత్రం పంచాయతీ కార్యదర్శి ఇవ్వాలని కొందరు డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారు సంతకాలు పెట్టడంతోపాటు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు తమకు అవకాశం లేదని చెబుతుండ్రు.
దీంతో చేసేదేమీ లేక కొందరు డాక్యుమెంట్ రైటర్లు ఫోర్జరీ సంతకాలు పెట్టి మేము అన్ని చూసుకుంటాం అంటూ సంబంధిత వ్యక్తులకు వారి ఇండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా లావాదేవీలు సైతం జరిగాయని ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఫోర్జరీ సంతకాలు చేశారని కేసు నమోదు..
తమ ప్రమేయం లేకుండా కొందరు గ్రామంలో గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రంపై సంతకాలు, స్టాంపు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఓ పంచాయతీ కార్యదర్శి కోయిలకొండ పోలీస్ స్టేషన్ నం దు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు ఆయన కోరారు.
కోయిలకొండ ఎస్త్స్ర ఈ విషయంపై స్పందిస్తూ కేసు నమోదైన విషయం వాస్తవమని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల విషయంపై ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగా అనే కోణంలో విచారణ చేయనున్నట్లు ఎస్త్స్ర తెలిపారు
తెలియకుండానే కేసులో ఇరుకుతున్న రుణ గ్రహీతలు..
అప్పులు చేసుకుని తిప్పలు పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రైవేట్ కంపెనీలు అందిస్తున్న రుణాలు తోడ్పాటును అందిస్తున్నప్పటికీ అప్పుల పాలు చేస్తున్నాయి. ఇల్లు ఇల్లు కుద పెడితే రుణం ఇస్తారని తప్ప ఇతరత్రా ప్రక్రియ వారికి తెలియకుండానే జరిగి పోతుంది. తీరా చివరికి చూస్తే వారిపై కూడా కేసులు నమోదు అయ్యే వెలుగులోకి వస్తుం ది. ఈ విషయాలు తెలుసుకున్న కొందరు రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇందుకు వారి ఇండ్లు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడమే. ముందుగా ఆసక్తిగా రుణాలు తీసుకుంటున్నప్పటికీ అత్యధిక వడ్డీ కావడంతో తిరిగి చెల్లించడంలో గ్రామీ ణ ప్రాంత రుణ గ్రహీతలు తీవ్ర ఇబ్బందు లు గురవుతున్నారు. దీనికి తోడు వారి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు రుణ గ్రహీతల నుంచి అత్యధికంగా వసూలు చేస్తు న్నారు.
దీంతో చేసేదేమీ లేక వారు అడిగిన కాడికి అప్పజెప్పి డాక్యుమెంటు పూర్తి అయి న తర్వాత వివిధ కంపెనీలకు మార్టీ గేజ్ చేసి రుణాలు పొందుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కేసులు కూడా నమోదు కావడంతో మరింత ఆందోళనలో రుణ గ్రహీతలు ఉన్నారు.
రిజిస్ట్రేషన్ కు పంచాయతీ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు..
ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే పంచాయతి కార్యదర్శి ధ్రువీకరించిన పత్రం అవస రం లేదు. నిబంధనలో కూడా ఎక్కడ లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ లాగిన్ లో కనిపిస్తే చేసేందుకు అవకాశం ఉంది. మేము చేసిన డాక్యు మెంట్లు అన్నీ కూడా లాగిన్ లో కనిపిస్తేనే చేశాం. ఎవరిని ఇబ్బంది పెట్టేలా రిజిస్ట్రేషన్లు చేయలేదు.
నిబంధనల పేరుకు రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. పంచాయతీ ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఓ పంచాయతీ కార్యదర్శి గతంలో మా సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.
హమీద్, సబ్ రిజిస్టర్, మహబూబ్ నగర్