calender_icon.png 3 May, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు!

03-05-2025 12:00:00 AM

  1. వాణిజ్య దుకాణాలతో కిరాయి వసూలు
  2. సాగు కోసం కేటాయిస్తే అక్రమ నిర్మాణాలతో వ్యాపారం
  3. ప్రభుత్వ ఆదాయానికి గండి
  4. రాజకీయ నాయకుల అండదండలు
  5. కోనాపూర్లో వెలుగు చూసిన వైనం

కొండాపూర్, మే 2 : భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని కేటాయించి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేలా ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు ఇదే అదనుగా భావించి సర్కారు భూమిలో వాణిజ్య దుకాణాలను, భవనాలను ఏర్పాటు చేసుకొని దర్జాగా లబ్దిపొందుతున్నారు.. దీనిని నివారించాల్సిన గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు మామూళ్ళ మత్తులో ఊగిపోతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు...

పైగా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటూ అధికారులను బెదిరిస్తూ దర్జాగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా సర్కారు భూమిలో వాణిజ్య దుకాణాలు, భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇదేమిటని అడిగే నాథుడు లేకపోవడంతో వారు అడిందే ఆట పాడిందే పాటలా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే..కొండాపూర్ మండలం సీహెచ్ కోనాపూర్ గ్రామ శివారులోని గేట్ వద్ద సర్వే నం బర్ 54లో గల ప్రభుత్వ భూమిని గతంలో వీరేశం యాదవ్ అనే వ్యక్తికి సాగు చేసుకోవడానికి కొంత భూమిని కేటాయించారు. కాగా గత నాలుగైదు సంవత్సరాల క్రితం సదరు లబ్దిదారుడు ఆ భూమిని సాగు చేయకుండా ఆ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా భవనం నిర్మించుకున్నారు.

అంతేగాకుండా రేకులతో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసి కిరాయికి ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా తనను అడిగేవారు లేరంటూ దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు తగ్గట్టు సంబంధిత అధికా రులు సైతం అతనికే వత్తాసు పలకడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. 

రాజకీయ నాయకుల అండదండలు..

ప్రభుత్వం కేటాయించిన భూమిలో కేవ లం సాగు మాత్రమే చేసుకోవాలనేది నిబంధన. ఒకవేళ లబ్దిదారుడు సాగు చేసుకోని పక్షంలో ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలి. కానీ ఇక్కడ అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో సద రు లబ్దిదారుడు దర్జాగా భవనాన్ని నిర్మించడమే కాకుండా వాణిజ్య దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకొని కావల్సినంత రాబడి పొందుతున్నాడు.

ప్రభుత్వ భూమి లో యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడలేదు. ఎందుకని ఆరా తీస్తే కిందిస్థాయి నుండి ఎమ్మెల్యే వరకు అండదండలు ఉన్నాయని అధికారులే చెప్ప డం విశేషం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన అతనిపై చర్యలు తీసుకోక పోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.

పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పంచాయతీ అధికారులు ఎందుకు చర్యలు తీసు కోలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మామూళ్ళకు తలొగ్గి అక్రమ నిర్మా ణాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు నేరం.. 

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తాను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాను. అయినా ప్ర భుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం నేరం. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, వ్యాపారం చేసిన వారిపై  తగు చర్యలు తీసుకుంటాం.

అశోక్, తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తాం సర్వే నంబర్ 54లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన విషయంలో విచారణ చేపడుతున్నాం. వీరేశం యాదవ్కు నోటీసులు జారీ చేస్తాం. ఎవరైనా అనుమతులు లేకుండా  నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.

 ప్రణీత్, పంచాయతీ సెక్రటరీ