03-11-2025 02:15:52 AM
సౌతాఫ్రికా ఎపై భారత్ ఎ గెలుపు
బెంగళూరు, నవంబర్ 2 : గాయంతో దాదాపు 3 నెలలు ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీలో అదరగొట్టాడు. సౌతాఫ్రికా ఎ జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో భారత్ ఎ జట్టును గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సౌతాఫ్రికా ఎపై భారత్ ఎ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఎ 309 పరుగులకు ఆలౌటైంది.
తనుష్ కొటియాన్ (4/83)రాణించాడు.ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీతో రాణించినా భారత్ ఎ 234 పరుగులకే ఆలౌటైంది. పంత్(17) నిరాశపరిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఎను భారత బౌలర్లు 199 పరుగులకే ఆలౌట్ చేశారు. తనుష్ కొటియాన్ 4, అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు తీశారు. తర్వాత 277 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఎ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
విజయానికి 105 పరుగుల దూరంలో పంత్ ఔటైన తర్వాత ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో టెయిలెండర్లు అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్) మానవ్ సుతార్(20 నాటౌట్) అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు.కాగా పంత్ హాఫ్ సెంచరీ చేసి సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు రీఎంట్రీని ఖాయం చేసుకున్నాడు.