calender_icon.png 3 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

03-11-2025 12:20:08 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న(Chevella bus accident) ఘోర ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.  మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.