calender_icon.png 30 January, 2026 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి పల్లెలలో భరోసా వెల్ఫేర్ సొసైటీ సేవలు ప్రశంసనీయం

30-01-2026 08:17:46 PM

కూనవరం సర్పంచ్ శ్వేతా

మణుగూరు,(విజయక్రాంతి): మండలంలోని మారుమూల ఆదివాసి పల్లెలకు  భరోసా వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, కూనవరం సర్పంచ్ ఎనిక శ్వేతా అన్నారు. శుక్రవారం రేగులగండి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీకేఓసి రక్షణ అధికారి భరోసా వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు లింగబాబుతో కలసి వంద మంది ఆదివాసి  కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ... దాతల ప్రోత్సాహంతో  భరోసా వెల్ఫేర్ సొసైటీ సామాజిక సేవలు ఈ ప్రాంతంలో అనార్తులు అనాధలకు కష్టకాలంలో ఎంతగానో భరోసానిస్తున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి అమీనుద్దీన్, సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నాసర్ పాషా, ఏనీక బాలకృష్ణ, శనిగరపు అనిల్ కుమార్, సామాజిక కార్యకర్తలు  లీల,నాగుల జ్యోతి, లియాకత్ అలీ, రేగులగండి గ్రామస్తులు గుండి బీమా, వార్డు సభ్యులు గుండి దేవా,కారం భీమా, జోగయ్య, రమేష్,కుంజాదేవి తది తరులు పాల్గొన్నారు.