calender_icon.png 19 November, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల పోషణ, సంక్షేమం పిల్లల బాధ్యత

19-11-2025 12:00:00 AM

  1. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వి. రమేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ ౧8 (విజయక్రాంతి): వయోవృద్ధులు, తల్లితండ్రుల పోషణ, సంక్షేమం పిల్లల బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వి. రమేష్ అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సం స్థ, జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్‌ల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వయోవృద్ధులు - తల్లితండ్రుల పోషణ, సంక్షేమ చట్టం- 2007పై ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన, అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ యువరాజ, జూనియర్ సివిల్ జడ్జ్ డి.కె. రాణి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అసిఫాబాద్ కాగజ్నగర్  ఎ.ఎస్.పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ... వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొదటగా మనలో మార్పు వస్తే ఇతరులలో మార్పు తీసుకురావచ్చని, తల్లిదం డ్రుల పట్ల, పెద్దలపట్ల గౌరవభావం కలిగి ఉండాలని తెలిపారు.

ప్రస్తుతం మత్తుపదార్థాలకు బానిసలై క్షణికావేశంలో నేరాలు చేస్తున్నారని, ఆస్తుల కోసం కన్నవారికి, తోడబుట్టిన వారికి హాని చేస్తున్నారని తెలిపారు. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ కొరకు ఉన్న చట్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు. 

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ జిల్లాలో తల్లిదండ్రులను సరిగా పోషించని కుమారులు, కూతుర్లపై 28 కేసులు నమో దు చేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567 లో సంప్రదించవచ్చని తెలిపారు.

అనంతరం మత్తుపదార్థాల నివారణపై అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం- 2007 సంబంధిత గోడప్రతుల ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా అధికారులు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, పోలీస్ అధికారులు, వయోవృద్ధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.