19-11-2025 12:00:00 AM
సెస్ కార్యాలయంలో సోదాలు, రికార్డులు తనిఖీ
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18 (విజయ క్రాంతి): సిరిసిల్ల సెస్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సెస్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సెస్ కార్యాలయంలోని సిబ్బంది నుంచి వివిధ రికార్డులు, దస్త్రాలను వారు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.