calender_icon.png 8 July, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి

08-07-2025 04:58:48 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.సిరిచందన సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో 563 మార్కులతో టాప్ ర్యాంకర్ గా నిలిచింది. తద్వారా బాసర త్రిబుల్ ఐటీ(Basara Triple IT)లో సీటు లభించిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ... బాసర త్రిబుల్ ఐటీలో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కన్న తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసి మాజీ చైర్మన్ రాజాసింగ్ విద్యార్థిని సిరిచందనకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం గీతాదేవి, జి. తిరుపతిరెడ్డి, వెంకటరమణ, శ్రీదేవి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, వజ్రమ్మ, దుర్గయ్య, రాజమోహన్ గౌడ్, సాగర్, కనకయ్య, జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు.