08-07-2025 05:15:14 PM
అబద్ధాలు చెప్పి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న బీఆర్ఎస్ నాయకులు..
ఆసత్య ఆరోపణలు విమర్శలు..
ఆసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ & బీజేపీ నాయకులు మానుకోవాలి..
పేద ప్రజలకు ఇండ్లు ఇప్పించాలనే కనీస సోయి లేని బీఆర్ఎస్ నాయకులు..
ఇంకోసారి సీతక్కని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు..
కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండలం అధ్యక్షులు చిటమట రఘు..
ఏటూరునాగారం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న తరుణంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోవడంతో ప్రజలు ఆనందంలో ఉన్నారని ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటపట రఘు అన్నారు. ఏటూరునాగారం మండల(Eturnagaram Mandal) కేంద్రంలో మంగళవారం నిరుపేద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి అర్హులైన నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు రావడం చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు అక్కస్సుతో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ కమిటీల పేరుతో అన్యాయం జరిగిందని ఇందిరమ్మ కమిటీలు అనే చూపిస్తుండ్రు. మరి గెజిటెడ్ అధికారులతో సర్వే చేయించి ఆన్లైన్ పోర్టల్ సైట్ లో పొందుపరిచిన జాబితా ఆన్లైన్ లో అర్హులు కాదా. అని యాప్ ద్వారా వస్తుంది మళ్ళీ లైవ్ 1 లైవ్ 2.లైవ్ 3 వస్తుంది. దానిలో నిరుపేదలైన లైవ్ వన్ లో అర్హులు గుర్తించి ఇస్తున్నారు కమిటీతో అన్యాయం ఎక్కడ జరగలేదన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వం
ఇసుక దందా అంటున్నారు. లక్ష్మణ్ బాబు మేము పర్మిషన్ ఇసుక క్వారీలకు గిరిజన సొసైటీల ద్వారా, పిసా గ్రామసభల ద్వారా, ఎన్నిక చేయబడిన దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఇసుక క్వారీలే నడుస్తున్నాయి. పేదల ఇండ్లు కులకొట్టిన పార్టీ పోడు భూములలో హరితహారం పేరా వందలాది ఎకరాలు తీసుకొని మొక్కలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. మల్లంపల్లి మండలం సీతక్క చోరువతోనే జగదీష్ అన్న కుసుమ పేరుతో వచ్చిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కాదన్నారు.
పోలీస్ యాక్ట్
పోలీస్ వ్యవస్థ రూపొందిన కాడి నుండి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్లో మీ ఇంటి ముందు డాన్సులు చేసినందుకు ఎలక్షన్ ప్రచారంలో 18 మంది కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టించినది మీరు కాదా అన్నారు.గ్రామపంచాయతీ ఎలక్షన్లో 12మందిపై కేసులు పెట్టించావు. ఎమ్మెల్యే ఎలక్షన్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్ద పోలీసులతో కొట్టించావు. బూతులల్లో కేసీఆర్ కేటీఆర్ లా రౌడీయిజం చేశావు. నీవు చేస్తే న్యాయం మేము న్యాయంగా ఉన్నా కూడా అన్యాయం అంటున్నావ్. కరోనా కష్టకాలంలో వరదలు వచ్చినప్పుడు లక్ష్మణ్ బాబు ఎక్కడున్నావు కొండాయి వరదల్లో 8మంది చనిపోతే ఎక్కడ ఉన్నారు.అంటూ ప్రశ్నించారు.