calender_icon.png 9 July, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తి చేయాలి

08-07-2025 05:21:28 PM

రైతులకు ఆయిల్ పామ్ సాగు, లాభాలపై అవగాహన కల్పించాలి..

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తి చేయాలని, రైతులకు ఆయిల్ పామ్ సాగు, లాభాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S) అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి తో కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణము, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ (ఫ్యాక్టరీ) నిర్మాణముపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయిల్ పామ్ పంట సాగుపై, ఆయిల్ ఫామ్ కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన డాక్యుమెంట్స్, పర్మిషన్స్, మౌలిక వసతుల కల్పన, కావలసిన ఏర్పాట్లపై వివరంగా జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టికల్చర్ సహకార, సంఘాల బలోపేతం, రైతుల సౌకర్యార్థం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు.

పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలని సూచించారు. పామ్ ఆయిల్ పంట సాగు ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయని, ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ, రాయితీల వివరాలను తెలియపరచాలన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యమునకు మించి సాధించాలని, లబ్ధిదారుల ఎన్నిక, రైతుల నుండి దరఖాస్తులను, రైతు వాటా సేకరణ, ప్లాంటేషన్ పూర్తి, మొదలగు పనులను, ఆయిల్ ఫామ్ కంపెనీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన ఆయిల్ ఫామ్ విస్తీర్ణం లక్ష్యo 3000 ఎకరాలు సాధించడానికి వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు కలిసి ఒక నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేసి ఈ మొదటి సీజన్ లోనే 75% లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.