calender_icon.png 8 July, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కు తీర్చుకున్న వేటూరి సత్యనారాయణ

08-07-2025 05:17:31 PM

మందమర్రి (విజయక్రాంతి): మాజీ ప్రభుత్వ విప్, నల్లా ఓదెలు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరడంతో కాంగ్రెస్ నాయకులు, ఓదెలు అబిమాని వేటూరు సత్యనారాయణ పట్టణంలోని కోరేగట్టు హనుమాన్ ఆలయంలో మంగళవారం తన మొక్కుబడి తీర్చుకున్నారు. ఓదెలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో మండలంలోని అందుగుల పేట గ్రామంలోని కోరెగట్టు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “మనసారా మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకోవడం భక్తికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారా లింగన్న, గజ్జెల్లి లక్ష్మణ్, బండారి సత్యనారాయణ, వాసాల శంకర్, సంగి సంతోష్, ఎం నరసయ్య, వేల్పుల రవి, ఆవునూరి పోశం, తుంగపిండి శంకర్ లు పాల్గొన్నారు.