08-07-2025 05:02:12 PM
మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి(YS Rajasekhara Reddy Birth Anniversary) వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, పైడిమల్ల నర్సింగ్ లు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకపాత్ర వహించారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకే కిలో బియ్యం, ఫీజు రియంబర్స్ మెంట్, వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పథకాలను ప్రతి ఇంటికి అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు, సొత్కు ఉదయ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కడలి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మాయ తిరుపతి యాదవ్, సీనియర్ నాయకులు ఆలం శంకర్, గోగుల రాజయ్య, ఎర్ర రాజు, ముడారపు శేఖర్, విజయ్, షరీఫ్, రాచర్ల రవి, బీరం శ్రీనివాస్, పోలు సంపత్, రాకం సంతోష్, రంజిత్, నాంపల్లి వేణుగోపాల చారి, రాం రాజేష్ లు పాల్గొన్నారు