29-01-2026 12:00:00 AM
అధికారులు మేల్కొనేది ఎప్పుడు?
శ్రీరాంనగర్‌లో అన్యాక్రాంతం అవుతున్న ప్రజా ఆస్తులు
బహిర్గతమైన గిఫ్ట్ డీడ్ ఆధారాలు చర్యల కోసం స్థానికుల నిరీక్షణ
నార్సింగి, జనవరి 28: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో బహిరంగంగా జరుగుతున్న పార్కు స్థలాల ఆక్రమణలపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన స్థలాలను సైతం కబ్జాదారులు వదలకపోవడం, దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో 1991లో హుడా అనుమతి పొం దిన ఈ లేఅవుట్లో, ప్రజా ప్రయోజనాల నిమిత్తం సుమారు 6,058 చదరపు గజాల స్థలాన్ని నాలుగు పార్కుల కోసం కేటాయించారు. దీనికి సంబంధించి 1993లోనే గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ (రి.నెం. 11194/ 1993) కూడా చేశారు. అదనంగా వాణిజ్య సముదాయం కోసం మరో 8,174 చదరపు గజాలను కేటాయించారు.
అయితే, నేడు క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మొత్తం నాలుగు పార్కులలో మూడు పా ర్కులు ఇప్పటికే కబ్జాదారుల పరమయ్యా యి. వాణిజ్య సముదాయం కోసం కేటాయించిన భారీ స్థలం కూడా అన్యాక్రాంత మైంది. రాజకీయ అండదండలతోనే ఈ కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థలాల అక్రమణ పై స్పష్ట మైన ఆధారాలు, గిఫ్ట్ డీడ్ పత్రాలు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం పలు అనుమా నాలకు తావిస్తోంది.
ఇప్పటికే కాలనీవాసులు డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో విఫలమైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నా రు. ‘తక్షణమే ఆక్రమణలను తొలగించి, పార్కు స్థలాలకు ఫెన్సింగ్ వేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు అధికా రులను కోరుతున్నారు.