29-01-2026 12:00:00 AM
ఇంటింటి చెత్త సేకరణపై అధికారుల ప్రత్యేక ఫోకస్
డీఈఈలు, ఏఈలకు ఉన్నతాధికారుల కీలక శిక్షణ
వంద శాతం చెత్త సేకరణే ఏకైక మార్గం.. అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని సంపూర్ణంగా చెత్త రహితంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ బల్దియా తన వ్యూహాలకు పదును పెట్టింది. రోడ్ల పక్కన పేరుకుపోయే చెత్త కుప్పల గార్బేజ్ వర్ణాలబుల్ పాయిం ట్స్ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా కొత్తగా నియమితులైన పారిశుధ్య విభాగం ఇంజనీర్లకు ఉన్నతాధికారులు శిక్షణనిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డీఈఈ లు, ఏఈఈలు ఏఈలకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఇంటింటి చెత్త సేకరణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆటోల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా చూడాలని, అప్పుడే ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ఉంటారని పేర్కొన్నారు. తద్వా రా జీవీపీలను శాశ్వతంగా నిర్మూలించవచ్చని ఆయన అధికారులకు సూచించా రు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2024 లో జరిగిన తాజా సవరణలపై అధికా రుల కు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ గోపాల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.