15 March, 2026 | 2:38 AM

రాహుల్‌కు పార్లమెంట్ పిక్నిక్ స్పాట్!

15-03-2026 01:11 AM

చర్చించే దమ్ములేదు, నిబంధనలు పాటించే ఓపిక లేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీకి పార్లమెంట్ అంటే పిక్నిక్ స్పాట్‌గా మారిందని, టీ తాగుతూ కాలు మీద కాలు వేసుకుంటూ జోకులు వేసుకోవడమం టే ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. సభలో చర్చించే దమ్ము లేదు, బయట నిబంధనలు పాటించే ఓపిక లేదని మండిపడ్డారు.

పార్లమెంట్ భవనం ప్రవేశద్వారం వద్ద ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ భవనం మెట్లపై కూర్చొని టీ తాగుతూ, జోకులు వేసుకుంటూ పిక్నిక్ స్పాట్‌లా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

పార్లమెంటు ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ నాయకులతో కలిసి రాంచందర్‌రావు.. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని లెక్కలతో కేంద్ర ప్రభుత్వం వివర ణ ఇచ్చిన తర్వాత కూడా సమాధానం వినకుండా పార్లమెంట్ బయటకు వచ్చి, పార్ల మెంటరీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు. భారత ప్రజలను అవమానించిన ఈ చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు.