15 March, 2026 | 2:37 AM

వందశాతం పన్ను వసూళ్లు

15-03-2026 01:10 AM

చరిత్ర సృష్టించిన జమ్మికుంట మున్సిపాలిటీ

హుజురాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇంటి పన్నువసూళ్లలో వరుస గా రెండోసారి వందశాతం పూర్తి చేసి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చరిత్ర సృష్టించిందని మున్సిపల్ చెర్మైన్ మొలుగు ప్రశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జమ్మికుంట మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ మహమ్మద్ అయాజ్, మున్సిపల్ సిబ్బందిని ఘనంగా సత్కరించా రు.

ఈ సందర్భంగా చెర్మైన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్ళను వంద శాతం పూర్తి చేసిందని, ఈ ఆర్ధిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే వందశాతం పన్ను వసూళ్లు పూర్తి చేయడం గర్వకారణమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన ఇంటి పన్ను వసూలు చేసినట్టు తెలిపారు. సహకరించిన మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్.ఐ భాస్కర్, సూపర్ వైజర్లు వికాస్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీధర్, రాజ్ కుమార్, దీపిక, వాణి, శ్రీనివాస్,  సానిటర్ ఇన్స్ పెక్టర్ పీ మహేశ్, సదానందంలతో పాటు వార్డ్ ఆఫీసర్లకు, అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.