calender_icon.png 18 November, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త పాడే మోసిన ఎమ్మెల్యే

01-12-2024 04:58:12 PM

ఆసుపత్రి ఖర్చులు కూడా చెల్లించిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా కళ్యాణి గ్రామంలో పార్టీ కార్యకర్త అంత్యక్రియలు

కామారెడ్డి (విజయక్రాంతి): పార్టీ కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో ఆస్పత్రి ఖర్చులను ఎమ్మెల్యే భరించిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీధర్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం అతనిని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆసుపత్రిలో శ్రీధర్ గౌడ్ కు అయిన ఖర్చు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు భరించారు. ఆస్పత్రిలో ఆయన ఖర్చులు ఎమ్మెల్యే చెల్లించారు. ఆదివారం శ్రీధర్ గౌడ్ అంత్యక్రియలు కళ్యాణి గ్రామంలో నిర్వహించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అంత్యక్రియలకు శ్రీధర్ గౌడ్ ను తరలిస్తుండగా ఎమ్మెల్యే ఆయన పాడెను మోసారు. ఎన్నికలలో తన గెలుపుకు ఎంతో కృషి చేసిన శ్రీధర్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని మీకు అండగా ఉంటాను అని మదన్ మోహన్ రావు శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ శామ్యూల్ శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా, వెంకట్ రెడ్డి, నరేందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.