18-11-2025 01:14:44 AM
సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మృతులంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారే. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని సౌదీకి పం పాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృత దేహాలను మత సంప్రదా యం ప్రకారం అక్కడే ఖననం చేయాలని, ఇందుకోసం బాధిత కుటుంబాల్లో ఇద్దరిని చొప్పున సౌదీకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది.
అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సౌదీ బస్సు ప్రమాదంలో 45మంది మృతి చెందినట్లు తెలంగాణ హజ్‌కమిటీ అధికారిక ప్రక టన చేసింది. మరణించిన వారంతా హైదరాబాద్‌కు చెందినవారేనని వెల్లడించింది.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి
సౌదీ అరేబియాలోని బదర్- మదీనా మ ధ్య జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడంతో.. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమా దంలో మ రణించినవారి కుటుంబాల కోసం సచివాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మక్కాకు వెళ్లినవారి కుటుంబ సభ్యు లు వివరాల కోసం 79979 59754, 99 129 19545 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
పీసీసీ చీఫ్ సంతాపం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వా సులు మృతిచెందడం పట్ల పీసీసీ చీఫ్ మ హేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని బా ధితకుటుంబాలను పరామర్శిస్తామన్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి సంతా పం ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం తో సంప్రదిస్తోందన్నారు.
సౌదీ అరేబియాకు బీఆర్‌ఎస్ మైనార్టీ నేతలు : కేటీఆర్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన మైనార్టీల కుటుంబాలకు అండగా నిలవడానికి తెలంగాణ బీ ఆర్‌ఎస్ నాయకత్వం ముందుకొచ్చింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి న వారి కుటుంబాలను పరామర్శించేందు కు,
అవసరమైన సహాయ చర్యలను పరిశీలించేందుకు సౌదీకి వెళ్లాలని బీఆర్‌ఎస్ మై నార్టీ నేతలకు కేటీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో సహా పలువురు సీనియర్ మైనార్టీ నేతలతో కేటీఆర్ ఫోన్లో మా ట్లాడి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక బృందం సౌదీకి బయలుదేరేందుకు సిద్ధమైంది. పరిస్థితులు తెలుసు కుని బాధిత కుటుంబాలతో సమన్వయం చేసేందుకు ఈ బృందం అక్కడికి వెళ్లనుంది.