26-07-2025 10:39:54 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యాపేట (విజయక్రాంతి): చేయూత పింఛన్ ను ముఖ గుర్తింపు ద్వారా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల నుండి బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికి పంచాయతీ సెక్రటరీ మొబైల్ లో అప్ ద్వారా లబ్ధిదారుల ముఖ గుర్తింపు విధానం ద్వారా పోస్ట్ మాన్ పింఛన్ లబ్ధిదారులకి అందజేస్తారన్నారు.
అలాగే అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలని నాటడంతో పాటు వాటి రక్షణను కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలోజడ్పీ సిఈఓ వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, జడ్పీ డిప్యూటీ సిఈఓ శిరీష, డిఎల్ పిఓ నారాయణ రెడ్డి, పోస్టల్ సూపరిటీడెంట్ వెంకటేశ్వర రావు,ఎంపిడిఓ లు, ఎంపిఓ లు, పంచాయతీ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.