calender_icon.png 27 July, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా నిలువపై ప్రత్యేక దృష్టి సారించాలి

26-07-2025 10:36:49 PM

తెలంగాణ రాష్ట్ర మార్కెట్ సొసైటీ  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి..

నేరేడుచర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తెలంగాణ స్టేట్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి(Telangana State Market Society Director Srinivas Reddy), నల్గొండ జిల్లా మార్కెట్ డైరెక్టర్ పద్మ, హుజూర్నగర్ వ్యవసాయ సహాయ సంచాలకులు రవిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు యూరియా నిల్వ, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. తదుపరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎరువుల కొరత ఏమీ లేదన్నారు. కృత్రిమంగా ఎవరైనా ఎరువుల కొరత సృష్టించిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట పిఎసిఎస్ ఇబ్బంది ఉన్నారు.