26-07-2025 10:43:31 PM
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో ఆరున్నర కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్(SI Mahender) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, మహ ముత్తారం మండలం స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన 1.లోక హరిప్రసాద్ 2.జనగాం అంజి కుమార్ వీరు ఇరువురు ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతాల నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులకు అధిక ధరలకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుందామని ఉద్దేశంతో ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసి బయలుదేరి కరీంనగర్ కు వెళ్లే క్రమంలో పక్కా సమాచారం ప్రకారం మహా ముత్తారం మండలం తెలంగాణ మోడల్ స్కూల్ దుబ్బలపాడు వద్ద ఎస్సై తన సిబ్బందితో పట్టుకోవడం జరిగింది.
వారి నుండి 6:30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని యమహా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి ఇరువురిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపినారు. మండలంలోని గంజాయి సేవించే యువకుల అందరి పైన వారి దిన చర్య ల పైన పూర్తి నిఘ ఉంచ బడిందని ఈ విధంగా ఎవరైనా గంజాయిని అక్రమ రవాణా చేసిన సేవించిన వారిని గుర్తించడం కొరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని, యువకులు తమ అలవాట్లను మార్చుకోవాలని ఎస్ఐ తెలిపారు.