26-12-2025 07:42:03 PM
నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలో 108 అంబులెన్స్ సేవలను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్, జిల్లా కోఆర్డినేటర్ హరి రామకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని రికార్డులను, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాల్లో గర్భిణీలకు, ప్రమాద బాధితులకు తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించేలా తగు సూచలను సిబ్బందికి ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఈఎమ్‌టి రమేష్, పైలట్ యాదయ్య తదితరులు ఉన్నారు.