calender_icon.png 17 August, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీ నిషేధంపై శాంతి చర్చలు జరపాలి

17-08-2025 12:22:50 AM

- సీపీఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ, కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

ముషీరాబాద్, ఆగస్టు 16(విజయక్రాంతి): మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి శాంతి జరపాలని సిపిఐ (ఎంఎల్) పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో  ఈనెల 24న వరంగల్ లో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆయన పలువురితో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యదర్శి  నకిరేకంటే చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మల్లేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, పీడిత ప్రజల విముక్తి కోసం గత 50 సంవత్సరాలుగా దళిత, ఆదివాపీ, పీడిత ప్రజల పక్షాన ఈ దళారి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.

వేలాది మంది రాజ్యాహింసకు గురైన మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేదాన్ని ఎత్తివేసి, వారితో భేషరతుగా శాంతి చర్చలు జరపాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి ప్రభాకర్ తోపాటు, నకిరేకంటి చిట్టిబాబు, ఇష్టూ జాతీయ కన్వీనర్ షికావలి, రాష్ట్ర అధ్యకులు సుధాకర్, పీఓడబ్ల్యూ (విముక్తి) జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి బానోత్ సంతోష్ నాయక్, దుర్గం సైదులు, బి., దేవరాజు, సత్య వర్ధన్   తదితరులు  పాల్గొన్నారు.